హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జన గణనపై శిక్షణ కార్యక్రమం

అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం అధికారులకు రెండు రోజుల జనగణన శిక్షణ ప్రారంభమైంది. జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణరావు కార్యక్రమాన్ని ప్రారంభించి, జనగణనలో తప్పులకు తావులేకుండా ఖచ్చితత్వంతో విధులు నిర్వహించాలని సూచించారు. డేటా సేకరణ, డిజిటల్ యాప్ వినియోగంపై శిక్షకులు దయాసాగర్, డాక్టర్ జగన్నాథపూరి శిక్షణ ఇచ్చారు.