హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలలో కూటమిదే విజయం: సాయి

కోనసీమ: కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని అందించాయని జిల్లా TDP అధ్యక్షుడు గుత్తుల సాయి పేర్కొన్నారు. ముమ్మిడివరంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మెజార్టీ MPP, ZPTC స్థానాలు, మున్సిపల్ ఛైర్మన్, జడ్పీ ఛైర్మన్ పదవులను కైవసం చేసుకున్నామన్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేస్తామని స్పష్టం చేశారు.