హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం'

AKP: ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నక్కపల్లి రాజవీధిలో ధరణి రైస్ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ తహసీల్దార్ గణపతిరావు తెలిపారు. బీపీటీ బియ్యం కిలో రూ.49 చొప్పున 26 కిలోల బ్యాగ్ రూ.1,274కు విక్రయిస్తామన్నారు. ఒక ఆధార్ కార్డుకు నెలకు ఒక బ్యాగ్ మాత్రమే అందజేస్తామన్నారు.