హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న బాలకృష్ణ

సత్యసాయి: హిందూపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి విచ్చేసిన ఆయనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో హిందూపురానికి బయలుదేరి వెళ్లారు.