హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న గవర్నర్

SS: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మహాసమాధిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు గవర్నర్‌కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పాల్గొన్నారు.