SKLM: పోలాకి మండలం గాతలవలస సర్పంచ్ నామినేషన్ సందడిగా సాగింది. ఆదివారం టీడీపీ తరఫున దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు సోదరి మెండ ఆదిలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు ఆధ్వర్యంలో యాట్ల బసివలస నుంచి జడూరు కేంద్రం వరకు ర్యాలీగా వెళ్లారు. కూటమి బలపరిచిన వార్డు సభ్యులతో కలిసి రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎర్రన్న సోదరి


