అన్నమయ్య: జిల్లాలో ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు డీఈవో డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం తెలిపారు. 14 ఏళ్లు నిండిన వారు పదో తరగతిలో, పదో తరగతి ఉత్తీర్ణులు ఇంటర్లో చేరవచ్చని పేర్కొన్నారు. మధ్యలో చదువు ఆపిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పొడిగింపు


