హైదరాబాద్: 28°C
వార్తలు

2 రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు.. ప్రధాని ఎక్స్‌గ్రేషియా

గుజరాత్, రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కచ్(గుజరాత్) హైవేపై ట్రక్కు కారును ఢీకొనడంతో ముగ్గురు చిన్నారులు సహా ఆర్మీ కుటుంబాల ఏడుగురు మృతి చెందారు. కచ్ ఘటన బాధాకరమన్న ఆయన, బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపి, క్షతగాత్రులు కోలుకోవాలని 'X'లో ప్రార్థించారు.