హైదరాబాద్: 28°C
వార్తలు

తొమ్మిది మంది మృతిపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

రాజస్థాన్ కోటా-ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెల్లవారుజామున శంభుపుర వద్ద ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన క్రూయిజర్ ఢీకొనడంతో కనీసం 9 మంది మృతి చెందగా, 8 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ వార్త ఎంతో బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ముర్ము 'X'లో పేర్కొన్నారు.