జమ్మూకశ్మీర్ రాంబన్ జిల్లా భట్టి గనోట్ గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. భారీ అగ్నికీలలకు నాలుగు ఇళ్లు, సామగ్రి బూడిదైనా.. ప్రాణనష్టం, గాయాలు లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన బషీర్ అహ్మద్, ఫిర్దౌస్ అహ్మద్, మహమ్మద్ ఇస్రాయిల్, ఇంతియాజ్ అహ్మద్ నివాసాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
వార్తలు
జమ్మూకశ్మీర్‌లో భారీ అగ్నిప్రమాదం


