హైదరాబాద్: 28°C
వార్తలు

కెనడాలో భారత సంతతి జంట దారుణ హత్య

కెనడాలోని సర్రే నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వాల్‌మార్ట్ స్టోర్ పార్కింగ్ ప్రాంతంలో భారత సంతతికి చెందిన యువ జంటను దుండగులు కాల్చిచంపారు. మృతులను గగన్‌ప్రీత్ (23), సుఖ్‌జీత్ కౌర్‌(24)గా గుర్తించారు. NOV 15న ఈ ఘటన జరిగింది. ఇది లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిగా, వ్యవస్థీకృత నేరాలతో సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.