హైదరాబాద్: 28°C
వార్తలు

వరుసగా మూడేళ్ల వృద్ధికి బ్రేక్

కొవిడ్ తర్వాత వరుసగా మూడేళ్లు దూసుకెళ్లిన విమాన సీట్ల లభ్యతకు ఈ మధ్య కాలంలో బ్రేక్ పడింది. బ్రిటన్ విశ్లేషణ సంస్థ ఓఏజీ నివేదిక ప్రకారం.. ఈ నెలలో దేశీయ, విదేశీ మార్గాల్లో 2.106 కోట్ల సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది ఈనెల కంటే ఇవి 3.7% తక్కువ. విమాన సర్వీసులు 1,19,752 నుంచి 6.2% తగ్గి 1,12,267కు చేరాయి. అయితే 2022 నవంబర్‌తో పోలిస్తే సీట్లు ఇంకా 25% ఎక్కువగానే ఉన్నాయి.