NTR: జి.కొండూరు మండలంలో ఆదివారం తెల్లవారుజామున అమానుష ఘటన చోటుచేసుకొంది. గుర్తుతెలియని టిప్పర్ లారీ పందులు, వాటి పిల్లలపై నుంచి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో పందులు, పిల్లలు మృత్యువాత పడటంతో బాధితులకు సుమారు రూ.50 వేల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు వాపోయారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
టిప్పర్ నిర్లక్ష్యానికి మూగజీవాల బలి


