మిజోరం రాజధాని ఐజ్వాల్ ట్రాఫిక్ క్రమశిక్షణను మహీంద్రా సంస్థ చీఫ్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. 2017లో తెచ్చిన నో-హాంకింగ్(హార్న్) పాలసీతో నగరం ప్రశాంతంగా ఉందన్నారు. 2-3 గంటలు జామ్ అయినా ఎవరూ లైన్ దాటరని, హారన్ కొట్టకుండా ఓపికగా వేచి ఉంటారని ఓ యువతి వివరిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. మెట్రోల్లో నిశ్శబ్దం అరుదైన వేళ, ప్రశాంతత కోసమే యాత్రలు చేసే రోజులు వస్తాయని మహీంద్రా పోస్ట్‌లో పేర్కొన్నారు.
వార్తలు
అక్కడ నో హార్న్.. మహీంద్రా ఓనర్ ప్రశంసలు


