హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి!

SKLM: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జెడ్.రాగంపేట వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన వడ్డి సరస్వతి దుర్మరణం చెందారు. రాంగ్ రూట్లో వచ్చిన బైక్ను తప్పించే క్రమంలో హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వస్తున్న కారు అదుపుతప్పి, అన్నవరం దర్శనం ముగించుకుని వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డరు.