దేశీయ విమానయాన రంగం తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంటోంది. ఇంధన ధరలతో పాటు డాలర్ విలువ పెరిగి నిర్వహణ వ్యయం తడిసిమోపెడవుతుండటంతో సంస్థలు అప్రమత్తమయ్యాయి. లాభాలు తెచ్చే రూట్లలోనే విమానాలు నడుపుతూ, డిమాండ్ లేని సర్వీసులకు కోత పెడుతున్నాయి. ఫలితంగా భారత్‌లో ఉన్న మొత్తం విమానాల్లో దాదాపు ఐదో వంతు గ్రౌండ్‌లోనే నిలిచిపోయాయి. వేగంగా ఎదిగే మన మార్కెట్‌లో ఈ మార్పు కీలకంగా మారింది.
వార్తలు
లాభముంటేనే ఫ్లైట్.. ఐదో వంతు విమానాలు గ్రౌండ్‌లోనే!


