VZM: డెంకాడ మండలం గొడిపాలెం నుంచి బంటుపల్లి మీదుగా భోగాపురం వెళ్లే ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో గుంతను తప్పించుకునే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రధాన రహదారిపై ప్రమాదకర గుంత!


