హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 24న జాబ్‌మేళా.. యువతకు అవకాశం

TPT: వెంకటగిరిలోని విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 24న ఉదయం 8.30 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నారు. APSSDC, ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్, SEEDAP సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో 11కి పైగా కంపెనీలు 185 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన 18–35 ఏళ్ల యువతీ యువకులు పాల్గొనవచ్చు.