NLR: జిల్లాలో శనివారం విషాదం ఘటన చోటు చేసుకుంది. చెర్లోపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ పొదలకూరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మనుబోలు మండలం గొట్లపాలెం గ్రామానికి చెందిన విమలమ్మ తన అన్న అంత్యక్రియలకు హాజరై ఒక్కసారిగా అస్వస్థతకు గురై గుండెపోటుతో కుప్పకూలింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
ఆంధ్రప్రదేశ్
విషాదం.. అన్న అంత్యక్రియల్లో చెల్లికి గుండెపోటు


