CTR: సదుం మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల్లో 17 సర్పంచ్, 4 వార్డు సభ్యుల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు ఎంపీడీఓ రాధారాణి తెలిపారు. సర్పంచ్ స్థానాలకు వచ్చిన 105 నామినేషన్లలో 88, వార్డు సభ్యులకు వచ్చిన 304 నామినేషన్లలో 301 ఆమోదం పొందినట్లు వెల్లడించారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఆదివారం అప్పీల్ చేసుకోవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సదుం మండలంలో 21 నామినేషన్లు తిరస్కరణ: MPDO


