హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమావేశాల వాయిదాకు యూటీఎఫ్ నాయకుల డిమాండ్

WG: నవంబర్ నెలలో నిర్వహించ తలపెట్టిన పాఠశాల, సబ్జెక్టు కాంప్లెక్స్ సమావేశాలను వాయిదా వేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు, ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్ డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో సమావేశాలు నిర్వహిస్తే విద్యార్థుల చదువుపై మరింత ప్రభావం పడుతుందన్నారు. ఉపాధ్యాయులపై అదనపు పనిభారం తగ్గించి, బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.