హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శనగ రైతులకు పొలం బడి శిక్షణ

ప్రకాశం: గిద్దలూరు మండలం కొత్తకోట రైతు సేవా కేంద్రం పరిధిలో శనివారం శనగ పంటపై పొలం బడి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు రాజశ్రీ పాల్గొని రైతులకు పంట సాగు, విత్తన శుద్ధి, చీడపీడల నివారణపై అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే విధానాలను వివరించారు.