హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగులో జీవిత బీమా ప్రారంభం

ములుగు మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని మున్సిపల్ ఛైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి ప్రారంభించారు. భూమి లేని నిరుపేద కుటుంబాలకు సైతం బీమా ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరూ డిసెంబర్ 18లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.