MLG: కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. శనివారం ఇంచర్లలో పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. 18నుంచి 59 ఏళ్లలోపు అర్హులైన ప్రతి కుటుంబం నుంచి ఒకరి పేరును నమోదు చేసుకోవాలన్నారు. గ్రామాల్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ
VIDEO: ఇందిరమ్మ బీమా ప్రారంభించిన మంత్రి


