MBNR: దేవరకద్ర మదనపురం మండలం దుప్పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని తెలిపారు. అనంతరం చేయూత పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
దుప్పల్లిలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం


