హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీగా నాటుసారా పట్టివేత

ADB: నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఉమ్రి, భీంపూర్, మేడిగూడ బుద్ధగూడ, కొలాంగూడ గ్రామాల్లో ఆకస్మికంగా రైడ్ చేయగా.. గుడుంబా, దేశీదారు విక్రయిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సరిత తెలిపారు. వారి వద్ద నుంచి 15 లీటర్ల నాటు సారా, 90 ఎం.ఎల్ కలిగిన 95 దేశీదారు బాటిళ్లు, 400 లీటర్ల బెల్లం పానకాన్ని పట్టుకున్నారు.