నిర్మల్: బాసర గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన నిజామాబాద్‌లోని కంటేశ్వర్‌కు చెందిన శివకుమార్ (46) ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగి మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి భార్య సమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
గోదావరిలో జారిపడి వ్యక్తి మృతి


