హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాగునీరు విడుదల.. మంత్రికి కృతజ్ఞతలు

నంద్యాల నియోజకవర్గంలోని పాండురంగాపురం, చాపిరేవుల, కానాల, పుసులూరు, మిట్నాల గ్రామాల రైతులు సాగునీటి సమస్యను మంత్రి ఎన్ఎండీ ఫరూక్ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి పంట పొలాలకు నీటిని విడుదల చేయించారు. సకాలంలో సాగునీరు అందడంతో హర్షం వ్యక్తం చేసిన ఐదు గ్రామాల రైతులు మంత్రి ఫరూక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.