హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదనపు కలెక్టర్‌గా పి.కృష్ణ బాధ్యతల స్వీకరణ

GDWL: జిల్లా అదనపు కలెక్టర్‌గా పి.కృష్ణ శనివారం పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు.