హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్తీ కల్లు సరఫరాదారుడిపై పీడీ యాక్ట్

MDCL: కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే రసాయనాలు, మత్తు పదార్థాలను అక్రమంగా సరఫరా చేస్తున్న సిద్దగొని రంగయ్యపై ఎక్సైజ్ శాఖ పీడీ యాక్ట్ ప్రయోగించింది. ఈ మేరకు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. 25 కిలోల క్లోరల్ హైడ్రేట్ స్వాధీనం చేసుకున్న కేసుతో పాటు మరో రెండు కేసుల్లో రంగయ్య నిందితుడిగా ఉన్నాడు.