హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో రోబోటిక్ ల్యాబ్ ఏర్పాటు

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి ZPHS పాఠశాలలో రోబోటిక్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌ను జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి పరిశీలించారు. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ పాఠశాలలో రోబోటిక్ ల్యాబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.