హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ శనివారం పరిశీలించారు. అలాగే గుడి పేటలో యూనిట్ ఆఫీసులో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోకి వచ్చే ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు.