హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక

NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన బత్తుల భిక్షం కుమార్తె అమూల్య జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైంది. రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అమూల్య, ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి 'స్పీడ్ హ్యాండ్‌బాల్' క్రీడలో జాతీయ స్థాయికి అర్హత సాధించింది. అధ్యాపకులు, గ్రామస్తులు అభినందించారు.