హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫేక్ GST అధికారుల ఆట కట్టిస్తాం'

VKB: GST అధికారుల పేరుతో వ్యాపారులను మోసం చేస్తూ, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఫేక్ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ శ్రీలీల స్పష్టం చేశారు. అలాంటి వారిపై ఉక్కుపాదం మోపి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని శనివారం కొడంగల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో వ్యాపారుల కోసం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె హెచ్చరించారు.