హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండ్ల మార్కెట్ నిర్మాణంపై కమిషనర్‌కు వినతి

WGL: లక్ష్మీపురంలో అసంపూర్తిగా ఉన్న సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ కోరారు. శనివారం మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, వ్యాపారులతో కలిసి జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేసి 85 గదులతో మార్కెట్‌ను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.