హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లా కబడ్డీ జట్టుకు అరవింద్

KMM: తల్లాడ యూనివర్సల్ విద్యాలయానికి చెందిన పదో తరగతి విద్యార్థి కోడూరు అరవింద్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్‌-17 కబడ్డీ జట్టుకు ఎంపికయ్యాడు. ఎర్రుపాలెం మండలం మామునూరులో శనివారం నిర్వహించిన బాలుర కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా జట్టులో చోటు సంపాదించాడు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ టి.కె. ప్రసన్నన్, డైరెక్టర్ సోఫియా హర్షం వ్యక్తం చేశారు.