హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐలాపూర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

SRD: అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని ఐలాపూర్ తండాలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్థానిక రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.