KMR: గాంధారి మండలం నాగులూర్కు చెందిన మహిళా రైతు ఖాట్మండీ లక్ష్మీబాయి సేవింగ్స్ ఖాతాను బ్యాంక్ అధికారులు నిలిపివేశారు. పంట రుణం బకాయి ఉందంటూ పెద్ద పోతంగల్ కెనరా బ్యాంకు ఫ్రీజ్ చేసింది. దీంతో పీఎం కిసాన్, రైతు భరోసా నిధులు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఖాతాను పునరుద్ధరించాలని కోరారు.
తెలంగాణ
రుణ బకాయితో రైతు సేవింగ్స్ ఖాతా నిలిపివేత


