JN: దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు జెండా ఆవిష్కరించారు. మత్స్యకారుల ఐక్యత, హక్కులు, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వాలు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు.
తెలంగాణ
ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం


