హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తుల పాలిట దైవంగా మారిన బండరాయి!

HYD: నగర శివారు సూరారంలోని కైలాసగిరి ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు కేవలం ఒక భారీ బండరాయిగా ఉన్న ఈ ప్రాంతం, ప్రకృతి వైపరీత్యం వల్ల అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా మారింది. గతంలో ఈ బండరాయిపై పిడుగు పడటంతో అది రెండుగా చీలిపోయి మధ్యలో ఒక సొరంగం ఏర్పడింది. అనంతర కాలంలో స్థానికులు ఆ సొరంగం ముఖద్వారాన్ని ఏనుగు తల ఆకారంలో అందంగా తీర్చిదిద్ది ఆలయంగా మార్చారు.