హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ ప్రభుత్వ వైద్య కాలేజ్ విద్యార్థుల సమ్మె

KNR: కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు తమ ప్రధాన డిమాండ్ల సాధన కోసం శాంతియుత సమ్మెకు దిగారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, తమ హక్కులను అడుగుతున్నామని విద్యార్థులు స్పష్టం చేశారు. బాలురు, బాలికల హాస్టళ్లను వెంటనే అప్పగించాలని, కళాశాల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. భవన నిర్మాణాన్ని పూర్తి చేసి 2027 జనవరిలోపు అప్పగించాలని కోరారు.