హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమాలను ప్రశ్నిస్తే కేసులా? : ఎస్.పీ.కే. సాగర్

BHPL: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో అక్రమాలపై ఆధారాలతో ప్రశ్నిస్తే కేసులు, బెదిరింపులకు పాల్పడటం సరికాదని టీడీపీ రాష్ట్ర నాయకుడు ఎస్.పీ.కే. సాగర్ అన్నారు. మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ పీడీ పాత్రపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు.