హైదరాబాద్: 28°C
తెలంగాణ

తోటపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ప్రారంభం

NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామపంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన సర్పంచ్ జోగు రమణమ్మ ఇవాళ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 18 నుంచి 59 సంవత్సరాలలోపు అర్హులైన వారు తమ ఆధార్, నామిని ఆధార్ కార్డుతో స్వయంగా నమోదు చేసుకోవాలని సూచించారు. వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.