MDCL: కూకట్పల్లిలో HMDAకు చెందిన ట్రక్ పార్క్ భూముల వేలాన్ని నిలిపివేయాలని MLA మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు BRS, CPI, CPM నాయకులు, స్థానిక కాలనీవాసులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 22, 23 తేదీల్లో ట్రక్ పార్క్ వద్ద శాంతియుత నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. 27న జరిగే వేలంలో ఎవరూ పాల్గొనవద్దని, ప్రజా అవసరాలకు భూమిని వినియోగించాలని కోరారు.
తెలంగాణ
ట్రక్ పార్క్ భూముల వేలంపై అఖిలపక్ష సమావేశం


