MDK: తూప్రాన్(M) మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో బాలల గ్రామసభ, నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులతో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. మధ్యాహ్న భోజన నాణ్యత మెరుగుపరచాలని, పాఠశాలకు పీఈటీని నియమించాలని విద్యార్థులు గ్రామసభ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.
తెలంగాణ
మల్కాపూర్‌లో బాలల గ్రామ సభ!


