హైదరాబాద్: 28°C
తెలంగాణ

చందనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

NLG: చందనపల్లి గ్రామ శివారులో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. వేగంగా వచ్చిన కారు, బైకును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనంతో సహా పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు పానగల్లు గ్రామానికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.