WGL: MGM ఆస్పత్రిలో రోగుల వస్తువులకు రక్షణ లేకుండా పోతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగశాయిపేటకు చెందిన నరసయ్య ఈనెల 12న చేయి విరిగి ఆర్థో వార్డులో చేరారు. 14న అర్ధరాత్రి ఆయన బ్యాగులో ఉన్న రూ.17 వేల నగదు, గుర్తింపు కార్డులు చోరీకి గురయ్యాయి. భార్య జ్యోతి రమణ పోలీసులకు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని భాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
MGMలో రోగి బ్యాగ్ చోరీ.. స్పందించని అధికారులు


