BHPL: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని బుగులోని వేంకటేశ్వరస్వామి జాతర ఈ నెల 23 నుంచి ఐదు రోజులపాటు వైభవంగా జరగనుంది. తొలిరోజు మేళతాళాల మధ్య స్వామివారిని కొండపైకి తీసుకెళ్లనున్నారు. 24న కల్యాణోత్సవం, ఏనుగు వాహన సేవ, 25న అభిషేకాలు, వాహన సేవలు నిర్వహిస్తారు. 26న ప్రత్యేక పూజలు, 27న ముగింపు వేడుకలు జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు
తెలంగాణ
బుగులోని జాతర కార్యక్రమాలు ఇవే..!


