WGL: వర్ధన్నపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా శనివారం ముదిరాజ్ కులస్తులు జెండా ఆవిష్కరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చొప్పరి సోమయ్య మాట్లాడుతూ.. మత్స్యకారులంతా ఐక్యంగా ఉండి తమ డిమాండ్ల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం.. బైక్ ర్యాలీ


