హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై మట్టి కుప్పలు.. వాహనదారుల అవస్థలు

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ నుంచి వినాయక్ చౌక్ వెళ్లే మార్గంలో, డైట్ కళాశాల మైదానం నుంచి ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్లే రహదారిపై అండర్ గ్రౌండ్ పనుల కోసం తవ్వకాలు చేపట్టారు. అనంతరం మట్టిని రోడ్డుపైనే వదిలేయడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అధికారులు వెంటనే స్పందించి మట్టిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.